![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.
ఎవడ్రా నిన్ను పెళ్లి చేసుకునేదంటూ నోటికి వచ్చినట్లు మహా తిడుతుంది. భూషణ్ కి కార్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడున్నావని అతను అడుగగా ఎక్కడుంటే ఏంటి రాగాల్లో తేలుతున్నానని ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే భూషణ్ ఆదికి ఫోన్ చేసి మీ చెల్లి నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతుంది అసలు తను ఇంట్లో లేదని చెప్తాడు. వెళ్లి చూసి నాకు ఫోన్ చెయ్ అని భూషణ్ చెప్పగానే ఆది, హారిక ఇద్దరు కలిసి మహా దగ్గరికి వెళ్తారు. వెళ్లి చూస్తే అక్కడ మహా ఉండదు. ఆది ఇంట్లో అంత వెతుక్కుంటూ ఉంటాడు. వాళ్ల అమ్మనాన్నని నిద్ర లేపుతాడు. హారికకి మహా గదిలో లెటర్ దొరుకుతుంది. అది చదివి హారిక షాక్ అవుతుంది.
వెంటనే అ లెటర్ తీసుకొని వెళ్లి ఆదికి ఇస్తుంది. ఆ తర్వాత ప్రతాప్ ఆ లెటర్ తీసుకొని చదివి.. లేదు అలా ఎప్పటికి మహా చెయ్యదని తనే స్వయంగా మహా గదిలో వెతుకుతాడు కానీ ఉండదు. ఆ తర్వాత భూషణ్ ఫోన్ చేస్తుంటే ఆది లిఫ్ట్ చెయ్యడు. ఆ తర్వాత ఆది సీసీటీవీ చూస్తే .. అది ఆఫ్ లో ఉంటుంది. ఇంటిముందుకి వెళ్లి డ్రైవర్ చక్రి ఉన్నాడేమో చూస్తాడు కానీ చక్రి కూడా ఉండకపోయేసరికి ఆది ఇంట్లోకి వచ్చి ప్రతాప్ కి చెప్తాడు. తరువాయి భాగంలో మహా, చక్రిలని వెతకడానికి ప్రతాప్ రౌడీలతో మాట్లాడతాడు. చక్రి, మహా కార్ కి అడ్డుగా రౌడీలు వస్తారు . ఒకవైపు ప్రతాప్, ఆది, భూషణ్ వస్తుంటారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |